సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశంలో కరోనా కు ముందు 2ఏళ్ళ క్రితం లీటర్ 70 రూపాయలు చిల్లరకు దేశంలో ఎక్కడయిన దొరికే పెట్రోల్ ధరలు అడ్డులేకుండా పెరిగి పెరిగిపోయి రాజస్థాన్ వంటి చోట్ల 120 రూ కి కూడా చేరుకోవడం చూసాం. ఇటీవల అన్నిరాష్ట్రాలలో కాస్తో కూస్తో తగ్గిస్తూ 110 రూపాయలు కు అటుఇటుగా నిలబెట్టారు.అయితే అసలు తగ్గింపు ఎలా ఉండాలంటే.. టూవీలర్ వాహనదారులకు జార్ఖండ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెట్రోల్‌పై భారీ రాయితీను ప్రకటిస్తూ ద్విచక్ర వాహనాలకు ఏకంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 25 రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేడు, బుధవారం తెలిపారు. ఈ పథకం 2022 జనవరి 26 నుంచి అమలులోకి వస్తుందని సోరెన్ చెప్పారు.ఈ పథకంతో పేద, మధ్య తరగతి ద్విచక్ర వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి అన్నారు.టూవీలర్ వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదును నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని హేమంత్ సోరెన్ వెల్లడించారు. ప్రతి వాహనదారుడికి 10 లీటర్ల వరకు ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
