సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు దక్షిణభారత దేశంలో ఆక్వా రాజధానిగా ప్రసిద్ధి పొందిన భీమవరం లో ఆక్వా రైతుల కోసం ఎంపెడాMarine Products Exports Development Authority) ఆధ్వర్యంలో 16 కోట్ల రూపాయలతో నిర్మించనున్న భవన సముదాయాలు కు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం ఉదయం శంకుస్థాపన చేసారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మన ప్రాంత ఆక్వా రైతుల కు రొయ్యలు, చేపలు, ఇతర నీటి ఆధారిత పంటలు పండించడానికి మరింత ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంట క్వాలిటీ తెలుసుకోవడానికి కావలసిన సమాచారం ఇవ్వడానికి కొత్త ఆఫీస్ భవనం తో పాటు దానిలో కంట్రోల్ లేబరేటరీ,ఎలిసా లేబరేటరీ, అడ్వాన్స్ ఆక్వా కల్చర్ లేబరేటరీల భవనాలను ఎంపెడా ఇక్కడ ఏర్పాటు చెయ్యడం హర్షణీయం అని అన్నారు. ఈ భవన సముదాయాలు ఏర్పాటు అయ్యాక మన భీమవరం జోన్ ప్రాంత ఆక్వా రైతులు తో పాటు గోదావరి జిల్లాల రైతులకు ఇదెంతో [ప్రయోజనకారి అయ్యి మరింత నాణ్యమైన, అధిక దిగుబడితో ఆక్వా ఉత్పతులు ఎగుమతి అవుతాయని ఆకాంక్షించారు.
