సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారు వస్త్రాల అమ్మకాలపై పై GST 5% నుండి ఏకంగా 12% పెంచిన కారణంగా .. దానికి నిరసనగా రేపు గురువారం, మరియు ఎల్లుండి శుక్రవారం ( ది. 30-12-2021 & 31-12-2021 వ తేదీలలో) మధ్యాహ్నం 12:30 గం నుండి 1:00 వరకు షాపులు అర్ధగంట పాటు పట్టణంలోని అన్ని వస్త్ర దుకాణలు మూసి వేసి షాపు యజమానులు మరియు సిబ్బంది తో పాటు అందరూ నల్ల రిబ్బను ధరించి గంట మోగిస్తూ ఎవరి షాపు ముందు వారు కేంద్రానికి నిరసన తెలుపుతారని, ది భీమవరం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అయిశెట్టి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
