సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ చుసిన రబీ వరి పంట బంగారంలా మెరిసిపోతుంది.రైతులు ఆనందానికి హద్దులు లేవు.. ఎకరానికి 52బస్తాలకు పైగా వరి ధాన్యం దిగుబడి వస్తోంది. గత మార్చి లో కురిసిన వర్షాలు రబీ సీజన్ పంటను సరైన సమయంలో ఆదుకొన్నాయి. ఏలూరు జిల్లాలో లో 2.36 లక్షలు, పశ్చిమగోదావరిలో 2.13 లక్షల ఎకరాల్లో రబీ వరి బ్రహ్మాండంగా పండింది. గతేడాది డిసెంబరులో రబీ సీజన్ మొదలైంది. తరువాత ఫిబ్రవరి, మార్చి నెలల్లో శివారు, మెరకభూములకు గోదావరి, సీలేరు జలాలతో అనుసంధానం అయిన పంటకాలువలులో నీరుతగ్గి సాగునీటి ఎద్దడి ఏర్పడింది. అయితే అనూహ్యంగా మార్చి 15వ తేదినుండి ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో కురిసిన వర్షాలు రబి సాగును కీలకదశలో ఆదుకొన్నాయి. ఇక ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చుసిన పొలాలలో కోత యంత్రాలతో మెట్ట మండలాల్లోనూ వరి మాసూళ్లు జోరందుకున్నా యి.ఉంగుటూరు, తాడేపల్లిగూడెం , పెం టపాడు, తణుకు, అత్తిలి, గణపవరం ప్రాంతాల్లో గత వారం నుంచి ధాన్యాన్ని గట్టుకు చేరుస్తున్నారు.మరో 2వారాలలో డెల్టాలో ( ఉండి , భీమవరం తదితర ప్రాంతాలు) కూడా అన్ని ప్రాంతాల్లోనూ కోతలు ప్రారంభమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ఉమ్మడి పశ్చి మగోదావరిలో రికార్డు స్థాయిలో 8.73 లక్షల టన్నుల ధాన్యా న్ని సేకరిస్తామని పౌరసరఫరాల సంస్థ ఆశాభావంతో ఉంది.
