సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు జనవరి నెల 13 నుండి ప్రారంభమౌతున్న నేపథ్యంలోశ్రీ అమ్మవారి మూలవిరాట్ కు నూతన అలంకరణ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుండి నిలిపివేసిన దర్శనాలు నేటి, బుధవారం ఉదయం 11 గంటల నుండి తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నుండి ఆలయ ఆవరణలో మావుళ్ళమ్మ అమ్మవారికి కళాన్యాస పూజలు, హోమం ను ఆలయ ప్రధాన అర్చలు మద్దిరాల మల్లిఖార్జున శర్మ వేదపండితులు నిర్వహించి.శ్రీ అమ్మవారి దివ్య తేజోవంతమైన రూపంతో పునః దర్శనం కల్పించారు. విశేషంగా భక్తులందరు శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు డి.శ్రీ రామ వర ప్రసాద రావు గారు, సిబ్బంది, భక్తులు పాల్గున్నారు. నేటి, సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అమ్మవారి ని దర్శించుకొని ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ మావుళ్ళమ్మవారి అస్సిసులు పొందటం జరిగింది.
