సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రేవేటీకరణ లో భాగంగా బ్రిడ్ లో పాల్గొనడానికి కెసిఆర్ ప్రభుత్వం (సింగరేణి బోర్డు ద్వారా) సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో .. తెలంగాణ వైసిపి అడ్జక్షురాలు వై యస్ షర్మిల నేడు, మంగళవారం సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలకు దిక్కులేదు కానీ.. దొర గారు పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలను కాపాడే పనిలో పడ్డాడని విమర్శించారు. ‘‘ప్రైవేటీకరణ కాకుండా ఆపుతడట. రాష్ట్ర సొమ్ముతో పెట్టుబడులు పెడతాడట. అక్కడ ఉద్యోగులను ఆదుకుంటాడట. మరి మన రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతేంది దొర? ఇక్కడ రోడ్డున పడ్డ వేలాది కార్మికుల కుటుంబాలు నీ కండ్లకు కనపడడం లేదా? గెలిస్తే 100రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని మోసం చేశావ్. అజంజాహీ మిల్స్, పేపర్ ఫ్యాక్టరీలకు పునర్వైభవం తీసుకొస్తానని దగా చేశావ్. ఎన్నడో మూతపడిన IDPL,HMT,HCL,ఆల్విన్, ప్రాగటూల్స్ లాంటి కంపెనీలను తెరిపించడం చేతకాలేదు. ముందుగా ఇక్కడ మూత పడిన పరిశ్రమలను తెరిపించు. రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకో. దమ్ముంటే కేంద్రం మెడలు వంచి బయ్యారం స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయించు. అని సవాల్ విసిరారు.
