సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సరిహద్దులోని ఉండి నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వ (సీఆర్‌ ఎఫ్‌) నిధులు రూ.47.5కోట్లతో నేడు, గురువారం పెదకాపవరంలో రహదారులకు తెలుగుదేశం ఎమ్మెల్యే మంతెన రామరాజు శంకుస్థాపన చేసారు. ప్రతి రోజు ఎక్కువమంది వాహనదారులు ప్రయాణించే కొల్లేరు నుంచి భీమవరం వైపు రహదారి..అలాగే.. గంటలరాయుడుపేట నుంచి పాములపర్రు వరకు సీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.25 కోట్లు, కలవపూడి నుంచి గణపవరానికి సంబంధించి ఏలూరుపాడు నుం చి గణపవరం వరకు రూ.22.5కోట్లతో రహదారులకు శంకుస్థాపన చేసారు. ఈ రోడ్ల పనులు శరవేగంగా పూర్తీ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *