సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) బిడ్జింగ్ గడువు ముగిసింది. గత నెల 27న విడుదలైన ఈవోఐ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చని ఆహ్వానించారు. 22 కంపెనీలు బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. కాగా ఇటీవల హడావిడి చేసిన బిడ్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఈవోఐ గడువు పెంచినా ఈవోఐ బిడ్జింగ్ కి స్పందన కనిపించలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను ప్రజలను ప్రభావితం చెయ్యాలన్న లక్ష్యంతో ప్యూహాత్మకంగా తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారంటూ భారీ ప్రచారం జరిగింది. కానీ తెలంగాణ లో మూతపడిన వందలాది ప్యాక్టరీస్ ల సంగతి , రోడ్డున పడ్డ వేలాది కార్మికుల సంగతి ఏమిటి? అని ప్రతిపక్షలు,కేంద్రంలోని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చెయ్యడంతో కెసిఆర్ ప్రభుత్వం వెనకడుగు వేసింది భావిస్తున్నారు. ఇక్కడ వైసిపి మంత్రులు కెసిఆర్ ప్రభుత్వానికి అంత సీన్ లేదని చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి.
