సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జమ్మూకశ్మీర్‌ లోని పూంచ్ ప్రాంతంలో సరిగ్గా.. 2021లో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలోనే’ ‘పీఏఎఫ్ఎఫ్‌’ ఉగ్రవాద సంస్థ మరోసారి భారత జవానులపై ఘాతుకానికి ఒడిగట్టింది. భీంబేర్‌గలీ నుంచి షాంగీ రోడ్‌కు వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు.ఈ ఊహించని ఉగ్రదాడి లో అమరులైన ఐదుగురు వీర జవాన్ల పేర్లను ఆర్మీ అధికారులు ప్రకటించారు. హవల్దార్ మందీప్ సింగ్, లాన్స్ నాయక్, దేవాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవత్ సింగ్‌లు అమర సైనికులని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అమరులైన ఐదుగురు జవాన్లలో నలుగురు పంజాబ్‌కు చెందినవారు కాగా, ఒకరు ఒడిస్సాకు చెందినవారని అధికారులు తెలిపారు. దేశ సేవలో అమరులయిన ఆ జవానులకు వారి కుటుంబాలకు సెల్యూట్. అటు ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ రంగంలోకి దిగింది.ఉగ్రదాడి ఘటనతో జమ్మూ కశ్మీర్‌లో పూంచ్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర పారామిలటరీ బలగాలు ఎలాంటి కదలికలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *