సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నూతనంగా నియమితులైన 43 మంది వాలంటీర్లకు నేడు, శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కీలక అనుసంధాన కర్త అని, ప్రజల దగ్గరికే పాలన తీసుకొనిరావాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ వాలంటర్ వ్యవస్థ దేశంలో మరిన్ని రాష్టాలకు ఆదర్శమైందంటూ అంటువంటి బాధ్యత తో, గౌరవంతో కూడిన మీరు ప్రజల కు ప్రభుత్వ సంక్షేమ పధకాలు , పింఛనులు అందించడంతో పాటు వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొనిరావడంలో మానవతా దృక్పధంతో పని చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొనిరావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమిషనర్ శివరామకృష్ణ తో పాటు స్థానిక వైసిపి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *