సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: సంక్రాంతి పండుగ అంటే భీమవరం అని తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు ఉండరు.. అటువంటిది ఈ నూతన 2022 ఏడాది ప్రారంభ వేడుకల నుండే భీమవరం పరిసర ప్రాంతాల ప్రజలకు వినోదాల జోష్ నింపడానికి, ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చే అతిధులకు బోనస్ ఆహ్లదం, వినోదం ఇవ్వడానికి భీమవరం లో స్థానిక లూథరన్ హైస్కూల్ గ్రౌండ్ లో భారీ స్థాయిలో S S ఎమ్యూజిమెంట్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను గత గురువారం రాత్రి, గ్రంధి శ్రీనివాస్ తనయుడు ,గ్రంధి రవితేజ ప్రారంభించారు.ఈ పలువురు పట్టణ ప్రముఖులు, రాజకీయనేతలు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఇంత పెద్ద స్థాయితో ప్రజలకు ఉల్లాసం నింపడానికి మంచి ప్యాషన్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను గ్రంధి రవితేజ అబినందించారు. నేడు, శుక్రవారం నుండి ప్రజలకు సాయంత్రం 5గంటల నుండి అందుబాటులో వుండే ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్సు గేటు వద్ద వేసిన భారీ మిక్కీమౌస్ హౌస్ సెట్ , లైటింగ్ ఏర్పాటు ఆహుతులను, చిన్నారులను ఆనందంతో కట్టిపడేస్తుంది. ఇక లోపల భారీ జయింట్ వీల్ తో పాటు ట్రైన్,చిన్నారుల బోటుషికారు, కొలంబస్, టొరాంటోరా వంటి ఎన్నో ద్రిల్ కలిగించే ఐటమ్స్ తో పాటు అన్నిరకాల వస్తువులు అమ్మే స్టాల్స్, బంధుమిత్రులతో సేద తీరడానికి భారీ చాట్ బండారులు, రుచికరమైన అనేక ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఏర్పాటు చెయ్యడం జరిగింది.
