సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏ పార్టీకైనా దమ్ము ఉంటె ఒంటరిగా 175 స్థానాలలో పోటీచేస్తారా? అని ఇటీవల సీఎం జగన్ విసురుతున్న సవాల్ కు టీడీపీ, జనసేన సాహసించలేకపోయిన తెలంగాణ లోని బిఆర్ ఎస్ పార్టీ పరోక్షంగా స్వాందించిందినేడు, గురువారం బిఆర్ ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కెసిఆర్ తో సమావేశం అయిన ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో కెసిఆర్ పర్యటన కు ఏర్పాట్లు చేస్తున్నామని తోలి బీఆర్ఎస్ సభ, వైజాగ్‌లో సభ పెట్టాలని నిర్ణయించామని.. త్వరలోనే తేదీ ప్రకటిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తోందని అనుమానాలకు తావులేదని ప్రకటించారు. అలాగే ఇటీవల హడావుడి చేసి చివరకు తగ్గిపోయిన.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో ఎందుకు పాల్గొనలేదనే విషయంపై కూడా తోట చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ఉన్న కొన్ని కేంద్ర నిబంధనల కారణంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో సింగరేణి పాల్గొనలేదని అయితే వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునే దమ్ము బీఆర్ఎస్‌కు ఉందని తోట చంద్రశేఖర్ ప్రకటించారు.
