సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్రలో పవిత్ర పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ‘షిర్డీ’ లో తెలుగు రాష్ట్రాల నుండి విశేషంగా సాయిబాబా వారిని దర్శించుకోవాలనే భక్తులకు నేడు, గురువారం సాయంత్రం తాజగా విడుదలయిన సమాచారం ప్రకారం మే 1వ తేదీ నుండి షిరిడి పట్టణం నిరవధిక బంద్ కు స్థానిక ప్రజలు, సంఘాలు పిలుపు నిచ్చినట్లు సమాచారం. ఇటీవల ఉగ్రవాద దాడి కి టెర్రరిస్ట్ లు సిద్దపడుతున్నారనే సమాచారంతో కేంద్ర ప్రభుత్వ బలగాలు ముందస్తు భద్రతా చర్యలు లో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాలలో మోహరించడం , షిర్డీ సాయి సంస్థాన్ వారు దేవాలయం లోపల తీవ్ర స్థాయిలో స్థానికులకు నిబంధనలు విధిస్తున్నారని దీని కారణంగా తాము చాల ఇబ్బందులు పడుతున్నామని ఇటువంటి చర్యలకు నిరసనగా తాము మే 1 నుండి షిర్డీ లో పట్టణంలో నిరవధికంగా బంద్ పాటిస్తామని హెచ్చరిక జారీచేశారు. వీరితో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్చలకు వచ్చి వారి ఇబ్బందులపై, అపోహాలపై వివరణ ఇచ్చి సాయి భక్తుల దర్శనానికి మార్గం సుగమనం చెయ్యవలసిన అవసరం ఉంది.
