సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్కినేని అఖిల్ హీరోగా , ముమ్మూటి ప్రధాన పాత్రలో సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో 2 ఏళ్లుగా సుదీర్ఘ షూటింగ్ జరుపుకొంటూ అనేక అంచనాలతో అఖిల్ కెరీర్ కు కీలకంగా చెప్పుకొంటున్న ” ఏజెంట్” సినిమా నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 70 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఏజెంట్ సినిమా సరైన ప్రమోషన్ లేకపోవడం తో భారీ ఓపెనింగ్స్ సాధించలేకపోయింది. ఇక సినిమా టాక్ విషయానికి వస్తే.. గూఢచారి కధనం తో రూపొందిన ఈ సినిమాలో అఖిల్ ఒక రేంజ్ లో అందమైన మాస్ లుక్ లో అంతర్జాతీయ యాక్షన్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా నటించాడు. సాంకేతికంగా ఎక్కడ గ్రాఫిక్స్ కు పేరు పెట్టవలసిన అవసరం లేదు. సూపర్బ్ గా యాక్షన్ సన్నివేశాలు కుదిరాయి. ఫస్టాఫ్ చాలా బాగుంది. సినిమా ప్లాట్, వార్నింగ్ సీన్ మరియు ఇంటర్వెల్ సీన్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అఖిల్ నటన చాలా ఇంప్రూవ్ అయింది. సెకండాఫ్ కూడా పర్వాలేదు. క్లయిమాక్స్ బాగుంది. కొన్ని ట్విస్ట్‌లు కన్విన్సెంగ్‌గా లాజిక్స్‌కి అందనంతగా ఉన్నాయి. వాటిని పక్కన పెడితే.. మూవీ అంతా బాగుంది. అయితే ఉన్న నాలుగు పాటలు సో.. సో.. గా ఇరికించినట్లు ఉన్నాయి. ఇక రామకృష్ణ గోవింద పాటని కావాలని ఇమడకపోయిన ఇరికించినట్లుగా అనిపించింది. ఐటమ్ సాంగ్ బాగా తీశారు. హీరోయిన్ బాగున్నప్పటికీ ఆ పాత్రకు పెద్దగా నిడివి లేదు. ఇక మలయాళం సూపర్ స్టార్ ముమ్మూటి తన అద్భుత నటనతో సినిమా స్థాయిని పెంచారు. హిందీ నటుడు డేను మారియో చాల సహజంగా నటించాడు. మొత్తానికి స్పై సినిమా అభిమానులను ఈ సినిమా అలరిస్తుంది. కుటుంబ సమేతంగా ప్రేక్షకులకు కొంచెం దూరం ఈ సినిమా.. కాస్త అదృష్టం కలసి వస్తే పాన్ ఇండియా స్థాయిలో అఖిల్ కు మంచి హిట్ సినిమాగా ఏజెంట్ నిలుస్తుంది.
