సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో ఒక సైకో భర్త కట్టుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన నేడు, శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ప్రాధమిక సమాచారం ప్రకారం..విపరీతంగా తాగుడు కు బానిసై భార్య గంజి నిర్మల(30)తో గత అర్ధరాత్రి సమయంలో భర్త గంజి దావీదు(35) ఘర్షణ పడ్డాడు. ఘర్షణ ముదిరి కత్తితో విచక్షణా రహితంగా మెడ మీద, చేతుల మీద నరికేశాడు. దీంతో నిర్మల అక్కడికక్కడే మృతి చెందింది. దావీదును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. నిర్మల దుబాయిలోపనిచేస్తూ కుటుంబాన్ని ఆదుకునేది. ఇటీవలే సొంతూరికి వచ్చింది. అయితే ఆరు నెలల క్రితం భార్య మీద కోపంతో తన కూతుళ్ళను చిత్రహింసలు పెడుతూ కొడుకుతో వీడియోలు తీయించి దావీదు తన భార్యకు పంపించాడు. మూడు రోజుల క్రితం తాను మరిపోయానని భార్య, పిల్లలని బతిమాలి ఇంటికి తీసుకొచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. డీఎస్పీ బండారు శ్రీనాథ్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *