సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొనడానికి తమిళ సూపర్ స్టార్, సీనియర్ సినీ హీరో రజని కాంత్ నేడు, శుక్రవారం ఉదయం విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో రజినీకాంత్‌కు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ , టీడీ జనార్దన్, సావనీర్ కమిటీ రిసీవ్ చేసుకుని ఘన స్వాగతం పలికారు. రజనీకాంత్ నేటి సాయంత్రం రాత్రి, ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై రెండు పుస్తకాలు విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాల పాఠం అందులో ఉండనుంది. విజయవాడకు వచ్చిన రజనీకాంత్‌ను చంద్రబాబు ఉండవల్లి లోని తన గెస్ట్ హౌస్ కు తేనెటి విందుకు ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి సూపర్ స్టార్ రానున్నారు. తేనేటి విందు అనంతరం అక్కడి నుంచి రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు కుటుంబసభ్యులు.. అందరూ కలిసి సాయంత్రం ఐదు గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభ వద్దకు వెళ్ళనున్నారు. గతంలో సీఎంగా ఎన్టీఆర్ ను చంద్రబాబు పదవి నుండి దించి నప్పుడు కూడా రజనీకాంత్ చంద్రబాబు కు మద్దతు పలకడం ఇక్కడ గమనార్హం..
