సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సహకార సంఘాలకు నూతన పాలకవర్గాలుగా నియమితులైన వారంతా కూడా రైతుల సంక్షేమం కోసం పాటుపడాలి అని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. నేటి శుక్రవారం సాయంత్రం వీరవాసరం సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా ఎంపికైన కొలుపూరి గౌరీ, డైరెక్టర్ గా ఎన్నికైన చికీలే విశ్వేశ్వరయ్య, మత్యపురి సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా ఎంపికైన కురెళ్ళ కాశీ విశ్వేశ్వర రావు, డైరెక్టర్లు పాలా నెల బాలుడు, పోతుల లీలాకర్ లు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వారందరిని అభినదించారు.
