సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మంత్రి రోజా నేడు, శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్గీయ ఎన్టీఆర్ సభలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ ని, సీఎం పదవిని లాక్కున్న చంద్రబాబు ప్రక్కన కూర్చుని రజనీకాంత్ .. ఎన్టీఆర్ శతజయంతి సభలో పాల్గొనడం పైగా తెలుగు రాష్ట్రం ,రాజకీయాలపై అవగాహన లేకుండా చంద్రబాబు కు మద్దతుగా మాట్లాడటం ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఎన్టీఆర్ యుగపురుషుడు అన్న వారు ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇప్పించలేదు. ప్రస్తుత సీఎం జగన్ కృష్ణజిల్లా కు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించారు. అంతేకాని చంద్రబాబు కాదు.. ఆ సభలో రజని కాంట్ తో చంద్రబాబు ఎన్నో అబద్దాలు చెప్పించారు. అలాగే ఎన్టీఆర్ ఫై దారుణమైన కార్టూన్ లు వేసి దారుణంగా అవమానించిన వ్యక్తిని కూడా రజనీకాంత్ పొగడటం తో నిజమైన ఎన్టీఆర్ అభిమానులు బాధపడుతున్నారు. తెలుగు నాట రజనీకాంత్ కున్న గౌరవం ఆయన తాజా వ్యాఖ్యలతో తగ్గించుకొన్నారు. వందలాది ఏళ్లుగా హైదరాబాద్ ప్రపంచం లో ప్రముఖ నగరంగా గుర్తింపు పొందింది. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్అభివృద్ధి చెందింది. విదేశాల్లోతెలుగువారు ఉద్యో గాలు పొందడానికి కారణం వై యస్ రాజశేఖర్ రెడ్డి కారణం.. చంద్రబాబు కాదని రజనీకాంత్ తెలుసుకోవాలి. ప్రజలను ప్రమాదాలనుండి రక్షించడానికి 108 పెట్టింది..ఆరోగ్యశ్రీ, చిన్నారులకు గుండె ఆపరేషన్స్, విద్యార్థుల కు ప్రభుత్వ ఖర్చుతో ఫీజు రియింబర్స్ మెంట్ తెచ్చింది వైఎస్సా ర్.. చంద్రబాబు కాదు. చంద్రబాబు విజన్ 2020 వల్ల టీడీపీ 23 సీట్లకుపరిమితమైంది.విజన్ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్ కు తెలుసా?. అని రోజా ఆగ్రహం వ్యక్తం చేసారు.
