సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం, చేబ్రోలు జాతీయ రహదారి వద్ద నేడు, శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రాధమిక సమాచారం ప్రకారం .. తాడేపల్లిగూడెం హార్టీకల్చర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ జానకీరామ్ తన భార్యతో కలిసి ఇటీవల కడప దగ్గర అనంతరాజు పేట కళాశాల భవనం ప్రారంభోత్సవానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా డ్రైవర్ నిద్రమత్తు ఆవరించడంతో చెట్టును ఢీ కొన్నాడు అని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు మరియు జానకీరామ్ కు తీవ్ర గాయాలు కాగా ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందింది. గాయలపాలైన వైస్ ఛాన్సలర్ జానకీరామ్‌ను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. .డ్రైవర్‌ను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తీ సమాచారం రావాల్సి ఉంది.
