సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న .. ఎన్టీఆర్30’లో తారక్ పాత్ర గురించి దర్శకుడు కొరటాల శివ అభిమానులకు ఒక రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. దీనిని బట్టి తారక్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో ఊహించవచ్చు.. అయన మాటలలో.. ‘ఈ కథలో మనుషుల కంటే మృగాలే ఉంటాయి…భయం అంటే ఏంటో తెలియని మృగాలు అవి…దేవుడంటే భయం ఉండదు.. చావంటే భయం లేదు…ఆ మృగాలకున్న భయం ఒక్కటే! అదేంటో అందరూ ఊహించే ఉంటారు’’ అని భారీ MASS సంకేతం ఇచ్చారు. తాజాగా ఈ చిత్రం యాక్షన్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్‌సిటీలో పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌కు కొరటాల సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజున అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చే పనిలో పడ్డారు దర్శకుడు.. తారక్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఫొటో షూట్ ఒక రేంజ్ లో చేసారని ఫిల్మ్ నగర్ టాక్..దాంతోపాటు ఈ ఏడాది సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతుండడంతో దానికి సంబంధించి కూడా తారక్ ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
