సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు, శనివారం రాష్ట్ర ప్రజలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుసంపన్నంగా, సుఖసంతోషాలతో, ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం ప్రజలకు మరింత ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సంపదలను అందించాలని అభిలషించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించి, ప్రజలకు మంచి భవిష్యత్‌ అందించేలా ప్రభుత్వం సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *