సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సహకారంలో ‘ ఫిష్ ఆంద్రా స్టాల్స్ ‘ మినీ ఫిష్ ఆంద్రా రిటైల్ స్టాల్స్ ను ప్రోత్సహించేందుకు వాటి నిర్వాహకులకు అనేక రాయితీలతో పాటు సబ్సిడీలు ఇచ్చింది. ఐతే బయట చేపల వ్యాపారం చేసేవారి టర్నోవర్‌ ఆధారంగా ఫీజు వసూలు చేయాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రభావం రాష్టంలో అత్యధిక ఆక్వా ఉత్పత్తులు 10వేల టన్నులు పైగా లారీలో ఎగుమతులు, అమ్మకాలు చేసే పశ్చిమ గోదావరి జిల్లా లో ఎక్కువ పడనుంది. చెరువులలో చేపలు కొనుగోలు చేసే 100 కి పైగా మధ్యవర్తులు, వేలాది మంది వ్యాపారులు దీనిపై పునః సమీక్షించాలంటున్నారు. చేపల వ్యాపారులు ఇప్పటివరకు మార్కెట్‌ సెస్‌ టన్నుకు రూ.500 చెల్లిస్తున్నారు. ఇకపై రైతుల నుంచి చేపలు కొనుగోలు చేసే వ్యాపారులు, ఏడాదికి రూ.25 లక్షలపైన టర్నోవర్‌ చేస్తే రూ.20 వేలు, రూ.25 లక్షల కన్నా తక్కువ అమ్మే వ్యాపారులు రూ.10 వేలు లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చేపలు, మత్స్య ఉప ఉత్పత్తులు విక్రయించే రిటైల్‌ వ్యాపారులు రూ.25 లక్షలపైన టర్నోవర్‌ ఉంటే రూ.10 వేలు, రూ.25 లక్షల కన్నా తక్కువ వ్యాపారమైతే రూ.5 వేలు ఫీజు చెల్లించాలని జీవో పేర్కొంది. రోజుకు సుమారు10 వేల టన్నుల విలువైన చేపల లారీలు రోజుకు సుమారు 150 వరకు పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నాయి. ఇక నుండి ప్రభుత్వం చేర్చిన జీవో ప్రత్యక్షంగా వ్యాపారులకు పరోక్షంగా చేపల ధరలు రిటైల్ మార్కెట్లో పెరిగి వినియోగ దారులఫై ప్రభావం చూపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *