సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయ్ ఆంటోని హీరోగా, సంగీత దర్శకుడుగా గతంలో వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా ‘బిచ్చగాడు’ తెలుగునాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మ్యూజికల్ గాను పాటలు జనాన్ని ఊపేసాయి. సినిమా బంపర్ హిట్.. కేవలం 50 లక్షల డబ్బింగ్ రైట్స్ తో మరో 50 లక్షల పబ్లిసిటి ఖర్చుతో రిలీజ్ చేసిన నిర్మాతకు కలెక్షన్స్, శాటిలైట్ కలిపి అన్ని ఖర్చులు తీసెయ్యగా సుమారు30 కోట్ల ప్రఫిట్ తో అపర కోటీశ్వరుడిని చేసిన ‘బిచ్చగాడు’ సెక్వెల్ బిచ్చగాడు 2 మరింత భారీ బడ్జెట్ తో విజయ్ ఆంటోని హీరోగా ఈనెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ అదుర్స్ అనిపిస్తుంది. ఈసారి బిచ్చగాడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ట్రైలర్ చుస్తే అర్ధం అవుతుంది. తమిళం, తెలుగులో ఒకేసారి బిచ్చగాడు 2కలెక్షన్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా దండెత్తుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *