సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని పంచారామక్షేత్రం, శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు వేంచేసి యున్న శ్రీ ఆంజనేయ స్వామి వార్కి హనుమత్ జయంతి సందర్భముగా విశేష పూజ కార్యక్రమములు నిర్వహించారు. ఈ సందర్భములో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ స్వామి వార్కి దర్శించుకొనగా, తగు ఏర్పాట్లను ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ శ్రీమతి కోడే విజయ లక్ష్మి మరియు ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి చాంగటి సురేష్ నాయుడు పర్యవేక్షించారు. శ్రీ స్వామివారికి చేసిన విశిష్ట పుష్ప అలంకారం ఫై చిత్రంలో చూడవచ్చు.
