సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో మార్గదర్శి తో పాటు పలు ప్రవేటు చిట్స్ కంపెనీ లపై నిర్వహణ లోపాలపై సీఐడీ దాడుల నేపథ్యంలో.. ఏపిలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా ఉండాలని చిట్స్ నిర్వహణలో ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానం లోనే సాగనుందని ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేడు, సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అంతేకాదు.. ఇ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను ప్రారంభించారు. ఈ కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కం పెనీలు అన్ లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వ హిం చాలి. ఇందుకోసం ఏపీ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు ఇ-చిట్స్ అనే ఎలక్ట్రానిక్ను రూపొందించాయి. చందాదారులు అంతా ఇ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో.. ఈ కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చు . గతంలో నమోదు అయిన చిట్స్ సంస్థలు క్రమంగా ఈ విధానం లోకి రావాల్సిందేనని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.
