సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 8 రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో రికార్డు స్థాయిలో వేసవి ఉష్ణోగ్రతలు నమోదు అవుతూరాత్రిళ్ళు కూడా వడ గాల్పులతో సూర్య ప్రతాపానికి ప్రజలు విలవిలా లాడుతున్న దృశ్యాలు అన్ని ప్రాంతాలలో కనిపిస్తూనే ఉన్నయ్యి. అయితే ఇందంతా ఒక ఎత్తు.. నేడు ఆంధ్రప్రదేశ్ రాఫ్ట్రంలో మంగళవారం తీవ్ర వడగాల్పులు తడాఖా మరో ఎత్తులో ఉండబోతుందని ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావద్దని, వాహనాలపై బయట తిరుగవద్దని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఉదయం 6గంటల నుండే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వడగాల్పులు వీస్తున్నాయి. అయితే ప్రధానంగా గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లాల్లో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వృద్ధులు, చిన్నారులు, గర్బిణీలు జాగ్రత్తగా ఉండాలి వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *