సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డిపోల నుంచి ఈ వేసవిలో ప్రతీ శనివారం రాత్రి విశాఖ విహార యాత్ర పేరిట ప్రత్యేక సర్వీసులను ప్రారంభిస్తున్నామని భీమవరం లోని ఆర్టీసీ జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.వీరయ్యచౌదరి తెలిపారు. విహార యాత్రలో భాగంగా సింహాచలం, కైలాసగిరి, ఉడా పార్కు, నేవీ మ్యూజి యం, ఆర్కే బీచ్‌, కాళీ టెంపుల్‌, జూపార్కు చూపించి సోమవారం ఉదయం భీమవరం స్టేషన్కు చేరుకొంటామన్నారు. టికెట్టు ధర భీమవరం నుంచి రూ.1,150 (సూపర్‌ లగ్జరీ) నరసాపురం నుంచి రూ.1,380 (ఇంద్ర), రూ.1,110 (సూపర్‌లగ్జరీ), తాడేపల్లిగూడెం నుంచి రూ.1,330 (ఇంద్ర), రూ.1,110 (సూపర్‌లగ్జరీ), తణుకు నుంచి రూ.1,290 (ఇంద్ర), రూ.1,040 (సూపర్‌ లగ్జరీ). దీనితో పాటు జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రతీ ఆదివారం ఉదయం విష్ణు శక్తి దర్శిని పేరిట భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, అంతర్వేది, అప్పనపల్లి, వాడపల్లి పుణ్య క్షేత్రాల సందర్శన ఉంటుంది. ప్రతీ నెలా పౌర్ణమి ముందురోజు నాలుగు డిపోల నుంచి అరుణాచలం నడుపుతున్న ప్రత్యేక సర్వీసులకు మంచి స్పందన వస్తోంది. త్వరలో భీమవరం, తణుకు డిపోల నుంచి భద్రాచలానికి ప్రత్యేక సర్వీసులు నడుపుతామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *