సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : అమరావతిలో పేదలకు సెంటు భూమి చప్పున ఇళ్ల స్థలాల కేటాయింపులకు సిద్ధం అవుతున్న జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని నేడు, బుధవారం తీర్పు ఇచ్చింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వ డాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె ఎం .జోసెఫ్ , జస్టిస్అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్5 జోన్లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో .. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బెంచ్ తీర్పు సందర్భంగా పేర్కొంది. చట్టం ప్రకారమే ఐదు శాతం మాత్రమే ఈడబ్ల్యూ ఎస్ కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వు లకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని, ల‌బ్ధిదారులు వేరే వాళ్ల‌కు విక్ర‌యించ‌కూడ‌దని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. దీనితో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణి ఫై జగన్ సర్కార్ అడ్డంకులు తొలగిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *