సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా నివాసానికి నేడు, శనివారం వెళ్లారు. ఇటీవల రాధాను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు.. తాజగా నేరుగా రాధా ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఇటీవల కొందరు ఆగంతకులు రెక్కీ నిర్వహించడంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ, తాను అండగా ఉంటామని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. రాధా భద్రతపై ఆయన ఆరా తీశారు. రాధా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని మంత్రి కొడాలి నాని సమక్షంలో వంగవీటి రాధా వెల్లడించడం తదుపరి, సీఎం జగన్ ఆదేశాల మేరకు రాధకు రక్షణగా ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. రెక్కీ ఎవరు నిర్వహించారు?.. ఎందుకు రాధాను హత్య చేయాలనుకుంటున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వంగవీటి హత్యకు రెక్కీ నిర్వహించిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆయన డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ కూడా రాశారు.
