సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విరూపాక్ష సినిమా హిట్ తో సాయిధరమ్ తేజ్ మంచి జోష్ లో ఉండగా ఇప్పడు మామయ్య పవన్ తో కలసి ప్రేక్షకుల ముందుకు జులై 28న వస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. గతంలో గోపాల- గోపాల సినిమా తరహాలో.. ఈ చిత్రంలో కాలానికి ప్రతినిధి అయిన కాలుడైన దేవుడు పాత్రలో పవన్ నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్ ఇది వరకే విడుదలైంది. ఆ తరవాత మార్కండేయులు పాత్రలో సాయిధరమ్ తేజ్ లుక్‌ని రివీల్ చేశారు. ఈసారి ఇద్దరూ కలిసి ఒకే పోస్టర్ లో వచ్చేశారు. పవన్, తేజ్ ఒకే ఫ్రేములో ఉన్న పోస్టర్ని తాజగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుండడం పెద్ద విశేషం. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.శరవేగంగా షూటింగ్ పూర్తీ చేసుకొని జులై 28న విడుదల కు ‘బ్రో’ సిద్ధం చేస్తున్నారు.
