సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు రాష్ట్రాల చెందిన సీఎంలు సైతం గురుతుల్యులు గా భావించే స్వామి స్వరూపానంద, విశాఖ శారద పీఠానికి చెందిన వారసుడు స్వాత్మనంద సరస్వతి స్వామి నేడు, శనివారం భీమవరం లో పర్యటించారు. అంతర్జాతీయ తెలుగు బాషా పరిరక్షణ వేడుకలులో భాగంగ భీమవరం గునుపూడి లో పంచా రామ క్షేత్రం అయినా సోమేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణం లో ఆంధ్ర వాజ్మయ్య వైభవ శోభయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేసారు. ఈ కార్యక్రమం లో స్వాత్మనంద సరస్వతి స్వామివారి ఆశీస్సులు ను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు తీసుకోవడం జరిగింది. కొద్దిసేపు స్వామివారితో అక్కడి కార్యాలయంలో మోషను రాజు మరోసారి భక్తి ప్రవక్తులతో స్వామికి ప్రణామాలు ఆచరించి ఆయన తో కొద్దిసేపు సమావేశం అయ్యారు. తదుపరి స్వామిజీ అంతర్జాతీయ తెలుగు సంబరాలు ను ఉత్సవ 18 శకటాలతో ర్యాలీగా ఆంధ్ర వైభవ శోభా యాత్ర ప్రారంభించారు. అనంతరం ఎస్. ఆర్. కె. ఆర్. ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో భారీ స్థాయిలో నిర్వహించిన సభలో ప్రసంగించడం జరిగింది.
