సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ నేడు, మంగళవారం ఉదయం కేంద్రమంత్రి గడ్కరీతో గంటకు పైగా భేటీ అయ్యారు. . సుమారు గంటపాటు సమావేశం కొనసాగింది. ఢిఏపీలోని జాతీయ రహదారుల అభివృద్ధిపై, నిధుల విడుదల ఫై కేంద్రమంత్రితో సీఎం జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. తదుపరి కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి ఠాకూర్‌లో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి, ప్రభుత్వ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు అంశాలపై చర్చిస్తున్నారు. గత సోమవారం ఢిల్లీలో సీఎం వైఎస్ జగన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను వేర్వేరుగా కలుసుకుని ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధికి, దేశ , అంతర్జాతీయ విమాన సర్వీసులు పెంపుకు సంబంధించిపలు అంశాలపై చర్చించి వినతి పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే.
