సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ షెడ్ రోడ్డులో రైలు బోగీ చక్రాలు రిపేరు చెయ్యడానికి ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఓ బోగీని లూప్ లైన్లో నిలిపి ఉంచారు. అందులో నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు రేగడం తో రైల్వే సిబ్బంది, భయబ్రాంతులకు లోనయ్యారు. స్థానిక రైల్వే పోలీసులు అప్రమత్తం అయ్యా రు. తమ వద్దనున్న గ్యాస్ లతో మంటలార్పే ప్రయత్నం చేశారు. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది అక్క డికి వచ్చి మం టలను అదుపు చేశారు. రైలుబోగీలో డీజిల్ ఉన్నందున పేలుతుందని ముందుగా అంతా కంగారు పడ్డారు. మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదానికి కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
