సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గోదావరి జిల్లాలలో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. గత నాలుగు రోజులు క్రితం రూ.280 ఉన్న ధర ఆదివారం నుండి అమాంతంగా పెరిగింది. ఎండల దాటికి తట్టుకోలేక కోళ్లు చనిపోవడం లేదా బరువు పెరగక పోవడం తో మార్కెట్‌లో అవసరాలకు తగిన విధంగా బ్రాయిలర్‌ కోళ్ల ఉత్పత్తి లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. నష్టాలు పూడ్చుకోవడానికి రేట్లు పెరిగాయంటున్నారు. భీమవరం రిటైల్ మార్కెట్ లో ప్రస్తుతం స్కిన్‌ లెస్‌ చికెన్ కేజీ రూ.330 ఉండగా, స్కిన్‌తో రూ.320కు విక్రయిస్తున్నారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని కూరగాయలు ధరలు కూడా రోజు రోజుకు, చికెన్ తో పోటీ పడుతున్నాయి. అల్లం ఇంకా కేజీ కి 350 రూపాయలు అమ్ముడు పోతున్న నేపథ్యంలో చికెన్ కూడా అదే ధరకు పోటీ పడుతుండటం యాదృచ్చికం. ఇక మటన్ ధర మాత్రం భీమవరం మార్కెట్ లో గత 2 ఏళ్లుగా కేజీకి 800 రూపాయలు పైమాటే.. తగ్గేదేలే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *