సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాలో నేడు, సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనం తపల్లి సమీపంలో వంతెనపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా కారు ఢీకొట్టి తుక్కు తుక్కు అయ్యింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ కు చెందిన 8 మంది హైదరాబాద్ లో ఒక వివాహానికి హాజరై తిరిగి స్వ స్థలానికి చేరుకొంటున్న క్రమంలో అనంతపల్లి శివారులో హైవేపై ఆగిఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు కొవ్వూ రులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మృతులను సత్తిబాబు, రవితేజ, శ్రావణికుమారి, అరుణ, దుర్గ, 8 నెలల బాలుడితో పాటు మరొకరు ఉన్నారు.
