సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పల్నాడు జిల్లా క్రోసూర్లో నేడు, సోమవారం జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుకొనే విద్యార్థులు కు స్కూల్స్ ప్రారంభ నేపథ్యంలో 43 లక్షల మంది విద్యార్థుల కోసం 1,043 కోట్ల రూపాయలు ఖర్చుతో ‘విద్యా కానుక ‘ప్రారంబిస్తున్నామన్నారు. వీళ్లు చిన్నారులు వీళ్లకు ఓటు హక్కు లేదు.. ఓట్ల కోసం పట్టించుకోవాల్సి న అవసరం లేదు అనేది గతం . కానీ, ఇవాళ వాళ్ల జగన్ మేనమామ ప్రభుత్వంలో విద్యా కానుక ఓ పండుగలా జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతీ ప్రజాప్రతినిధులందరూ పిల్లలతో కలిసి ఈ పండుగలో పాల్గొంటుడడం .. ఆ పిల్లల మేనమామగా సంతోషపడుతున్నా’.. మన స్కూల్ పిల్లలు కు అంతర్జాతీయ ప్రమాణాలు అందిస్తున్నాము. ప్రభుత్వ , ఎయిడెడ్విద్యార్థులకు విద్యా కానుక కిట్లు ఇస్తున్నాం. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చాం. ప్రతీ విద్యార్థికి మూడు జతలయూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు అందిస్తున్నాం . నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో పాటు బ్యాగు సైజులు పెంచాం. యూనిఫామ్ డిజైన్లోనూ మార్పులు చేశాం అని తెలిపారాయన.ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశామని చెప్ప డానికి గర్వపడతున్నాం అని సీఎం జగన్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *