సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేటి బుధవారం మధ్యాహ్నం అన్నవరం చేరుకొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యణ్ కు ఘన స్వాగతం పలికేందుకు జనసేన క్యాడర్ అన్నవరం చేరుకొంటున్నారు. అయితే మరి కొన్ని గంటల్లో వారాహి యాత్రకు పవన్ శ్రీకారం చుట్టనున్న నేపథ్యం లో నేడు, పోలీసుల అనుమతి కూడా వచ్చేసింది. వారాహి యాత్రకు అనుమతి ఇవ్వకుండా జగన్ సర్కర్ అడ్డుకొంటుందని వస్తున్నా వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ.. కాకినాడ ఎస్పీ సతీష్‌కుమార్ అనుమతి ప్రకటించారు. దీంతో జనసేన క్యాడర్ హర్షం వ్యక్తం చేసింది.. మరోవైపు మినిట్ టు మినిట్ పవన్ వారాహి యాత్ర షెడ్యూల్ఇవ్వాలని జనసేన నేతల్ని అడిగామని, వారు ఇస్తే సానుకూల నిర్ణయం తీసుకుంటామని, చట్టానికి లోబడి ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చన్నారు. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు అడిగామన్నారు కాకినాడ ఎస్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు కాకినాడ ఎస్పీ కోరినట్టుగానే వారాహి యాత్రకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను పోలీస్ అధికారులకు
జనసేన నేతలు ఇచ్చా రు. దీంతో యాత్రకు అనుమతి లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *