సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా 9 నెలలు పైగా సమయం ఉండగానే, ప్రతిపక్ష నేత, తెలుగు దేశం అధినేత చంద్రబాబు ముందస్తుగానే ఎన్నికలు వస్తున్నాయని.. ఇక తాడోపేడో తేల్చుకోవాలని.. పార్టీ నేతలను,క్యాడర్ ను మహానాడు, మినీ మహానాడులతో అలర్ట్ చెయ్యడం తో పాటు.. మొన్నటి వరకు రాష్ట్రము శ్రీలంక అవుతుందని విమర్శలు వెనక్కి తగ్గి .. సీఎం వైఎస్ జగన్ మాదిరిగానే తాను కూడా సంక్షేమ పాలన తీసుకొస్తానని, అంతకు మించి సంక్షేమ పధకాలు ఇస్తానని తన మేనిఫెస్టో తో ముందుకు వచ్చారు. అలాగే ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికపై కూడా ఆయన ఇప్పటికే ప్రెవేటు సర్వే ల ద్వారా అభిప్రాయాలు సేకరించి ఇప్పటికి 100 మంది పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారు అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాదయాత్రలో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో నారా లోకేశ్ అభ్యర్థులను ప్రకటించడాన్ని కూడా గమనించవలసిన అంశం.. వైసిపి నుండి వచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కూడా సీట్లను ఖరారు చేసి సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ, చిలకలూరిపేటలో భాష్యం ప్రవీణ్ తదితరులకు సీట్లు ఖరారు అయిన సూచనలు ఉన్నాయి. ఊహించినట్లుగానే జనసేనతో పొత్తు ఉండనున్న నేపథ్యంలో కొన్ని సీట్లను రిజర్వ్లోపెట్టినట్లు తిరుపతి, చిత్తూరు,విజయవాడలోని ఒకటి రెండు నియోజకవర్గాలుతో పాటు , ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భీమవరం, నర్సాపురం, తాడేపల్లి గూడెం సీట్లతో కలపిమొత్తం కలపి 30 సీట్లు రిజర్వ్‌లో పెట్టినట్టు భావిస్తున్నారు. బీజేపీ కూడా పొత్తుతో కలిసొస్తే వారికీ 15-20 సీట్ల వరకు ఇచ్చే యోచన లో ఉన్నట్లు తెలుస్తుంది.
