సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ , పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ” ఆదిపురుష్’ సినిమా రిలీజ్ సందర్భముగా దేశ విదేశాలలో శ్రీరామ భక్తులు, ప్రభాస్ అభిమానులు సందడి అంతా ఇంతా కాదు.. ఇప్పటికె అడ్వాన్స్ బుకింగ్ లో రేపటి నుండి 2 రోజుల పాటు అల్ షోస్ హౌస్ ఫుల్ అయ్యి సంచలన రికార్డు కలెక్షన్ నమోదు కానుంది. ఇక ప్రపంచం ఒక ఎత్తుఅయితే.. ‘హీరో ప్రభాస్ స్వంత ప్రాంతం భీమవరం’ లో ఎంతుంటుందో తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలుసు’తాజగా విడుదల అవుతున్న ఆదిపురుష్ ‘ సినిమా కోసం జిల్లా కేంద్రం భీమవరంలో ప్రభాస్ అభిమానులు చేస్తున్న సందడి.. భారీ పండుగ అంతా ఇంతా కాదు.. పట్టణం అంత లక్షలాది రూపాయలు ఖర్చుతో భారీ ఫ్లెక్సీ లు.. ముఖ్యంగా జేపీ రోడ్డులో అడ్డవంతెన వద్ద కిలో మీటెర్ మేర వరుస ఫ్లెక్సీ బ్యానర్స్ ,భారీ అపార్ట్మెంట్స్ వద్ద , పద్మాలయ థియేటర్స్ వద్ద, ప్రముఖ వ్యాపార సంస్థలు తమ షాపుల ముందు ఏర్పాటు చేసిన ప్రభాస్ శ్రీరామ చంద్రుడి గెటప్ లో 100 అడుగుల భారీ ఫ్లెక్సీ కటౌట్ బ్యానర్స్ చూడాలంటే రెండు కళ్ళు చాలవు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతి తో భీమవరంలో 3 గంటల నిడివి ఉన్నపటికీ ఆదిపురుష్ సినిమా ను 10 థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడం తో పాటు రేపు తెల్లవారు జాము 4 గంటల నుండి ప్రత్యేక ప్రదర్సనలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కరోజులో 60 షో లు తగ్గకుండా పడే అవకాశం ఉంది. ( గతంలో బాహుబలి ఒక్కరోజులో 14 థియేటర్స్ కలపి 97 షోలు వేశారు. అదో అద్భుతం..) భీమవరం జోన్ అంతా పోలీసులు ల ప్రత్యేక పర్యవేక్షణలో ఉంది. జై శ్రీరామ్ .. జై శ్రీరామ్ అంటూ కాషాయ జెండాలతో భీమవరంలో వాడవాడలా ఆదిపురుష్ అయోధ్య నగరాన్ని తలపిస్తూ ఆధ్యాత్మిక వాదుల సందడి నెలకొంది. ఆదిపురుష్ మరో బాహుబలి ని తలపించే విజయం నమోదు చెయ్యాలని కోరుకొందాం.. జై శ్రీ రామ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *