సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుడివాడలో నేడు, శుక్రవారం సీఎం జగన్ స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని తో కలసి టిడికో ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి సీఎం జగన్ బహిరంగ సభ లో లబ్ధిదారుల కుటుంబాల నుద్దేశించి మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే ఉచితంగా 300 అడుగుల టీడికో ఇళ్లు కట్టిస్తామన్న హామీని నెరవేర్చాం అన్నారు. ప్రతీ లబ్ధిదారునికి రూ. 7 లక్షల ఆస్తిని ఉచితంగా ఇవ్వడమే కాదు, అక్క చెల్లెమ్మల చేతిలో రూ. 6 నుంచి 15 లక్షల దాకా ఆస్తి పెట్టాం. గుడివాడలో పేదల ఇళ్ల స్థలాల కోసం, లేవుట్ 257 ఎకరాల స్థలం సేకరించి ఒక పక్క న టిడ్కో ఇళ్లు, మరోపక్క ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మా ణం చేస్తున్నాం. వీటన్నింటి మధ్య ఈరోజు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది.గుడివాడలో మొత్తం గా 13,145 మంది అక్క చెల్లెమ్మ లకు ఇళ్ల పట్టాలిచ్చాం. 8,912 టిడ్కో ఇళ్లతో కలిపి 16,240 ఇళ్లు, వాటిలో కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి. 14 ఏళ్ల చంద్రబాబు పాలన పేదలకు ఒక్క ఇల్లు అయినా కట్టించి ఇచ్చాడా? అని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు అతని దుష్ట చతుష్టయం అడ్డుకొన్నపటికి అదే అమరావతిలో 50 వేల మం ది అక్క చెల్లెమ్మ లకు సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలు ఇచ్చాం .ఈ నాలుగేళ్లు సంవత్సరాల కాలం లో2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా వేసిన ఘనత దేశంలో ఒక్క మన వైసిపి ప్రభుత్వానిదే అన్నారు సీఎం జగన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *