సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని గొల్లలకోడేరులో మోటారు బైకు ను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ఉప్పరగూడెం కు చెందిన చింతపల్లి శ్రీను, కాలా శ్రీను, చింతపల్లి మాణిక్యా లరావు అనే యువకులు గత బుధవారం రాత్రి బైక్స్ ఫై పాలకోడేరులో జరిగిన ఓ కార్య క్రమానికి హాజరై తిరిగి వచ్చే దర్శిలో గొల్లలకోడేరు సమీపం లోకి వచ్చే సరికి గరగపర్రు నుంచి భీమవరం వెళుతున్న లారీ వీరిని ఎదురుగా వచ్చి గుద్దేయడంతో పాటు లారీ క్యా బిన్ కింద ఇరుక్కు పోయిన వీరిని లారీ కొంతదూరం వరకు ఈడ్చు కువెళ్లిం దని స్థానికులు చెబుతున్నా రు. ఈ ప్రమాదం లో తీవ్రగాయాలపాలైన వీరిని స్థానికులు 108 వాహనంలో భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో చింతపల్లి శ్రీను పరిస్థితి విషమం గా ఉం డటం తో మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి తీసుకువెళ్లారు.
