సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, తోలి ఏకాదశి పర్వదినం నేపథ్యంలో అన్ని దేవాలయాలు పుష్ప అలంకరణలు తో ప్రత్యేక పూజలతో, విశేషంగా వచ్చిన భక్తులతో సందడితో ఆధ్యాత్మిక శోభ సంతరించుకొన్నాయి. ఇక గునుపూడి లో పవిత్ర పంచారామ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు నేడు తోలి ఏకాదశి సందర్భముగా శ్రీ స్వామి వార్కి పైనాఫిల పండ్లు(అనాస పండ్లు) తో అలంకరించడం జరిగింది. విశేషముగా భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుమారుడు, గ్రంధి రవితేజ తన జన్మదినం సంద్భరంగా స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారని , దేవాలయంలో భక్తుల ఏర్పాట్లను ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కోడే విజయ లక్ష్మి మరియు ధర్మకర్తలు పర్యవేక్షించారని , కార్యనిర్వహణాధికారి చాగంటి సురేష్ నాయుడు, ఒక ప్రకటనలో తెలిపారు.
