సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: త్వరలో ప్రముఖ క్రికెటర్,ఫైర్ బ్రాండ్ అంబటి రాయుడు వైసిపి లోకి చేరతారని, ఎంపీగా పోటీచేస్తారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో… నేడు, శుక్రవారం అంబటి రాయుడు మీడియా తో మాట్లాడుతూ.. తాను గుంటూరు జిల్లాలో ఇటీవల పలు ప్రాంతాలలో పర్యటించి తాజా పరిస్థితులను పలువురిని అడిగి తెలుసుకొన్నానని తెలిపారు. ప్రభుత్వపరంగా మంచి సపోర్ట్ అందుతుందని రైతులు చెబుతున్నారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు . రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు బాగా ఉపయోగపడుతున్నాయని రైతులు చెబుతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ప్రభుత్వ స్కూల్స్ కూడా చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. విద్యారంగంలో ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొచ్చిందని.. విద్యార్థులు భవిష్యత్తుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను స్పోర్ట్స్ గురించి మాట్లాడేందుకు కలిసినట్లు వివరించారు. రాష్ట్రంలో అకాడమీలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని మా తాత దగ్గర నుంచి నేర్చుకున్నానని అంబటి రాయుడు స్పష్టం చేశారు.
