సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్, ప్రభాస్ శ్రీరామ చంద్రుని పాత్రలో ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’ 3డి సినిమా విడుదలై రెండు వారాలు పూర్తయిన సంగతి తెలిసిందే. సినిమా ఫై టాక్ ఎలా ఉన్నపటికీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లో జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అంటూ ..ఉప్పొంగిన ప్రభాస్ మానియా ముందు బాలివుడ్ పెద్దలు కూడా ముక్కున వేలువేసుకొన్నారు. ఈ క్రమంలో బాక్సా ఫీస్ వద్ద ‘ఆదిపురుష్’ సందడి రేపటి ఆదివారం కలెక్షన్ తరువాత వచ్చే వారం నుండి ఇక తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు చిత్ర బృందమే స్వయంగా ప్రకటించింది. ఇక ఓటిటి , సాటిలైట్ రైట్స్ తో కలపి 500 కోట్ల పైగా బిజినెస్ అవలీలగా జరుగుతుంది. నిర్మాతలు సేఫ్. మరి అది పురుష్ ఓటీటీలో వచ్చే ది ఎప్పుడు? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ఆఫర్ తో దక్కించుకున్న సంగతి తెలిసిందే.జులై 15, 16 తేదీల్లో ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ’ ఉన్నాయి. ఈ సందర్భంగా‘ఆదిపురుష్’ను స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఏమైనా సరే.. థియేటర్స్ లో 3డి లో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్స్ అనుభూతి ఓటిటి లో వస్తుందా? చెప్పండి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *