సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన జగనన్న సురక్ష కార్యక్రమం భీమవరం నియోజకవర్గం లో ప్రారంభమైంది. నెల రోజులు పాటు జరుగుతుంది. తాడేరు గ్రామంలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ,ఆర్డీవో దాసి రాజు, ఎంపీపీ పేరిచర్ల నరసింహరాజు తదితరులు పాల్గొని సీఎం జగన్ ప్రజలపై ఎంతో ప్రేమతో రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ లబ్ధిదారుడు చిన్న చిన్న కారణాలు వల్ల ప్రభుత్వ సంక్షేమం పొందకుండా నష్టపోకూడదని సురక్ష ను ప్రారంభించారని అన్నారు. సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వరంలో నిర్వహించే ఈ ప్రత్యేక క్యాంపులలో అందే వినతులను అత్యంత వేగంగా పరిష్కారించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చెయ్యడానికి అధికారులు , వాలంటర్స్, సచివాలయ సిబ్బంది కృషి చేస్తున్నారు. కుల ధ్రువీకరణ, రేషన్ కార్డు వంటివి అవకాశం మేరకు స్పాట్ లో లబ్దిదారులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమక్షములో సర్టిఫికెట్లు అందజేస్తున్నారు.
