సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు సోమవారం గురు పౌర్ణమి పవిత్ర రోజు కావడంతో భీమవరంలో అన్ని సాయి బాబా దేవాలయాలలో ప్రత్యక పూజలు అభిషేకాలు , అన్నసమారాధనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎస్పీ స్టీట్ సమీపంలోని ‘మినీ షిరిడి‘ లో సాయి వ్రతాలు నిర్వహిస్తుండగా, పెదమిరం లో స్వర్ణ సాయి మందిర్ లో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. పంచ ద్రవ్యాలతో, ఆవుపాలచే భక్తులచే సాయి విగ్రహానికి అభిషేకాలు తో పాటు, యాగాలు, హారతి సేవలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం 7గంటల నుండి రాత్రి 9-30గంటల వరకు నిర్వహిస్తారు., ఉదయం 8గంటల నుండి అన్నసమారాధన .కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే జేపీ రోడ్డు లోని గురుదత్త అష్టలక్ష్మి ఆలయంలో కూడా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు రేపు ఉదయం నుండి విభిన్న కూరగాయలు ఆకూ కూరలు , పండ్లు పుష్పాలతో ” శ్రీ శాఖంబరి దేవి’ అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆలయ ఆవరణలో ‘చండి హోమం’ నిర్వహించనున్నారు.
