సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం .. ఎన్నో వేలమందికి ఉపాధినిస్తున్న చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మూసేశారని, సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం జగన్ అన్నారు. మూతపడిన చిత్తూరు డెయిరీని తాము తెరిపిస్తున్నామన్నారు. నేడు, మంగళవారం చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్.. శంకుస్థాపన చేసిన తదుపరి, బహిరంగ సభలోమాట్లాడుతూ.., ‘‘రాష్ట్రంలో 54 ప్రభుత్వ రంగ, సహకారరంగ సంస్థలను చంద్రబాబు తన మనుషులకు తక్కువ ధరకు అమ్మేసారు. మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సంగతి ఇప్పటి తరానికి తెలియదని బాబు నమ్మకం. .పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. చిత్తూరు డైరీ కి ఉన్న 182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్ చేస్తున్నాం. అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.‘‘రోజుకు 10 లక్షల లీటర్లపాలను ప్రాసెస్ చేసే స్థాయిలో డెయిరీ ఉంటుంది. చిత్తూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాలరైతులకు మేలు జరుగుతుంది.చంద్రబాబు గురించి అర్థం చేసుకున్న కుప్పం ప్రజలు కూడా బైబై బాబు అంటున్నారు. ఇన్నాళ్లకు ఈ 75 ఏళ్ల ముసలాయన కుప్పంలో ఇల్లుకట్టుకుంటున్నానని డ్రామాలు చేస్తున్నారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.‘‘తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయి. 2014 నుండి రాష్ట్రాన్ని దోచేసిన దత్తపుత్రుడు, చంద్రబాబు కల్సి ఇప్పడు అభివృద్థి, సంక్షేమాన్నిఅడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వెన్ను పోటు వీరుడు.. పవన్ ప్యాకేజీ శూరుడు. ఇవాళ పేదలకు, పెత్తం దార్లకుమధ్య యుద్ధం జరుగుతోంది అని సీఎం జగన్ పేర్కొన్నారు.
