సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల బీజేపీ పార్టీ అధ్యక్షుల మార్పుకు సంబంధించిన బీజేపీ అధిష్టానం ముందడుగు వేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అగ్రనాయకత్వం నియమించింది. రెండు మూడ్రోజుల్లో అధ్యక్ష పదవీ బాధ్యతలను కిషన్ రెడ్డి స్వీకరించనున్నారు. ఇక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ ఎన్నికల నిర్వహణ ఛైర్మన్‌గా కేంద్రం నియమించింది. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా సీనియర్ నేత, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా మంచి సౌండ్ వినిపించిన సోమువీర్రాజు స్థానంలో మితభాషి పురంధేశ్వరిని నియమించడం పెద్ద ట్విస్టే.. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ మంచి ఫైర్ బ్రాండ్అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. బండిని సంజయ్ ను మార్చొద్దని.. ఆయన్ను మారిస్తే రాష్ట్రంలో బీజేపీకి పరిస్థితులు అనుకూలించవని, దూకుడు తగ్గుతుందని ఫిర్యాదులు అధిష్టానానికి వెళ్లాయి. అయితే బండి సేవలను గౌరవిస్తూ కేంద్ర మంత్రి కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు అనధికార సమాచారం.
