సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో టూరిజమ్ అభివృద్ధిలో భాగంగా కడప జిల్లాలోని చారిత్రక ప్రాంతం గండికోటలో ప్రఖ్యాత హోటల్స్ గ్రూప్ కు చెందిన ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు నేడు, ఆదివారం ముఖ్య మంత్రి, జగన్ శంకుస్థాపన చేశారు. అలాగే తిరుపతి లో నిర్మిస్తున్న మరో ఒబెరాయ్ స్టార్ హోటల్స్ కు వర్చువల్గా సీఎం శంకుస్థాపన చేశారు. గండికోటలో సీఎం జగన్ భూమి పూజ చేసిన తదుపరి మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం. స్టార్ గ్రూపుల రాకతో గండికోటను ప్రపంచ టూరిజం మ్యా ప్లోకి తీసుకెళ్తాం, అన్నారు. ఈ కార్య క్రమం లో ఒబెరాయ్ హోటల్స్ ఎం డీ, విక్రమ్ సింగ్ ఒబెరాయ్, డిప్యూ టీ సీఎం అంజాద్ బాషా, మం త్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నా రు.
