సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వారాహి యాత్ర 2వ విడుత లో భాగంగా నేడు, ఆదివారం సాయంత్రం బహిరంగ సభ కోసం ఏలూరు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు గజమాలతో ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, దెందులూరు ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఉమ్మడి జిల్లా పార్టీ అడ్జక్షుడు కొటికలపూడి గోవిందరావు స్వాగతం పలికారు. ఏలూరు బైపాస్ రోడ్డు వద్ద స్వర్గీయ ఎస్వీ రంగారావు విగ్రహానికి పూలమాలవేసి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. పవన్ కళ్యాణ్ ర్యాలీగా క్రాంతి కళ్యాణ మండపంకు చేరుకున్నారు. అంతకు ముందు ఏలూరుకు వెళుతున్న పవన్‌కు గన్నవరం నియోజవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలకు కారు పై నుంచి అభివాదం చేస్తున్న పవన్ కళ్యాణ్ స్వాగతం ర్యాలీలో జనసేన కార్యకర్తల బైక్‌ను కారు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో అక్కడ నాలుగురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో నాలుగురిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా వారి పూర్తీ సమాచారం తెలియవలసి ఉంది.
